తూర్పులో మార్పు..ఆ ఎమ్మెల్యేలకు డౌటేనా!

-

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ అదిరిపోయే విజయాన్ని అందుకుని మళ్ళీ అధికారంలోకి రావాలంటే వైసీపీలో పలు మార్పులు జరగాల్సిందే…ఇప్పుడు ఆ దిశగానే సీఎం జగన్ సైతం పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అసలే కసి మీద ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో ఊహించుకోవచ్చు. అందుకే టీడీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వైసీపీ అధికారంలోకి వచ్చేలా చేయడానికి ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు ఎమ్మెల్యేలని పంపించారు.

ఇక ఇప్పుడు కలెక్టర్లు, అధికారులని సైతం పంపిస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలంటే కొందరు సీట్లు మార్చాల్సిన అవసరం ఉందని కూడా గ్రహించారు. ఇప్పుడున్న 151 మంది ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇస్తే వైసీపీ గెలుపుకు పెద్ద ఇబ్బంది. అందుకే ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని సైడ్ చేస్తే బెటర్ అనే అభిప్రాయంలో జగన్ ఉన్నారని తెలుస్తోంది.

ఇదే క్రమంలో రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరిపై జగన్ గట్టిగానే ఫోకస్ చేశారు. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తేనే రాష్ట్రంలో అధికారంలోకి రావడం సాధ్యమవుతుంది. అందుకే ఈ జిల్లాపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. జిల్లాలో మొత్తం 19 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 14 సీట్లు, టీడీపీ 4, జనసేన ఒకటి గెలుచుకుంది. జనసేన ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపుకు వచ్చారు. దీంతో వైసీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఈ 15 మందికి మళ్ళీ సీట్లు ఇచ్చేస్తారా? అంటే కష్టమే…ఈ సారి కొందరిని పక్కన పెట్టె అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన ఓ సర్వే కథనం చూస్తే…తూర్పులో…పిఠాపురం, జగ్గంపేట, రంపచోడవరం ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇవ్వడం కష్టమని తెలుస్తోంది. అదే సమయంలో కాకినాడ రూరల్‌లో ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబు విషయం కూడా డౌటే అంటున్నారు. అయితే అనుభవం ఉన్న కన్నబాబుని మార్చడం ఈజీ కాదు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న రాజమండ్రి రూరల్, అర్బన్ సీట్లలో సైతం వైసీపీ అభ్యర్ధులని మార్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి తూర్పు వైసీపీలో బాగానే మార్పులు జరిగేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news