బిగ్ బాస్ షో పై సంచలన కామెంట్స్ చేసిన వాసంతి.!

తెలుగు బిగ్ బాస్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ప్రారంభంలో ఎక్కువుగా సినిమాల్లో ,టీవి షోస్ లో పాపులర్ అయిన వారు హౌస్ లోకి వెళ్లేవారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పేరు తెచ్చుకున్న వాళ్ళు వెళుతున్నారు. ఇక షోలో వరసగా చాలా మంది మంచి కంటెస్స్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ షో లో ఆట తో కాకుండా గ్లామర్ తో నెట్టుకొచ్చిన వాసంతి కూడా బయటకి రావాల్సి వచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాసంతి మాట్లాడుతూ.. బిగ్ బాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5లో ఉండకపోయినా ఆ తర్వాత స్థానంలో అయినా ఉంటానని అనుకున్నా కానీ అలా జరగలేదు. అయితే హౌస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో మాకు ఒక అంచనా ఉండేది.కానీ  సూర్య, గీతూ ఎలిమినేట్ అయ్యే సరికి మాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది. హౌస్ లో వాళ్లే స్ట్రాంగ్ గా వుండే వారు, వారే ఎలిమినేషన్ అయ్యే సరికి నాకు కూడా ఆశ లేకుండా పోయింది అని చెప్పింది.

అప్పటికే బిగ్‌బాస్‌లో 70రోజుల పాటు ఉన్నాను. ఇక సూర్య, గీతూల ఎలిమినేషన్‌ తర్వాత హౌస్‌లో ఎప్పుడైనా, ఎవరైనా వెళ్లిపోతారు అని డిసైడ్‌ అయ్యాను. బిగ్ బాస్ షో అనేది మెంటల్ ఛాలెంజ్ గేమ్. అక్కడ ఏ మాత్రం నార్మల్ గా ఉండదు. చాలా టెన్షన్ పడుతూ ఒత్తిడి లో ఆడాల్సి ఉంటుంది.నేను బిగ్‌బాస్‌కి వెళ్లి వచ్చాక  నా బరువు 6కేజీలు తగ్గి పోయింది అని చెప్పుకొచ్చింది.