షారుఖ్ ఖాన్ కు ఘోర పరాభవం..!

-

బాలీవుడ్ బాద్షా షారుఖ్ సినిమా అంటే బాక్సాఫీస్ సందడి షురూ అయినట్టే.. అసలు ఇండియన్ సినిమాలకు ఓవర్సీస్ లో వసూళ్లను తెచ్చేలా చేసిన హీరో కూడా షారుఖ్ ఖానే. అయితే ఇదంతా ఒకప్పటి పరిస్థితి షారుఖ్ సినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కనీసం పాస్ మార్కులు కూడా రాబట్టడం లేదు. ఈమధ్య ఎన్నో అంచనాలతో వచ్చిన జీరో కూడా ఫెయిల్ అవడం షారుఖ్ ఖాన్ కు షాక్ ఇచ్చింది.

అయితే ఇవన్ని చాలదు అన్నట్టు రాకేష్ శర్మ జీవిత చరిత్రతో తెరకెక్కబోతున్న సారే జహాసె అచ్చా సినిమాలో ముందు షారుఖ్ ఖాన్ ను తీసుకున్నారు. కాని ఇప్పుడు ఆ సినిమా నుండి షారుఖ్ ను తొలగించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలో యువ నటుడు విక్కీ బెటర్ ను సెలెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. షారుఖ్ ఖాన్ కు ఇది ఘోర పరాభవమని చెప్పొచ్చు. కొన్నాళ్లుగా షారుఖ్ ఖాన్ సక్సెస్ కోసం ఎదురుచూస్తుండగా సక్సెస్ సంగతి అటుంచితే వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోతున్నాయి. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో చూడాలి. షారుఖ్ హిట్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news