Sharvanand: ఆ సినిమాపై శర్వానంద్‌కు హోప్స్..ఈ సారి బ్లాక్ బాస్టర్ గ్యారంటీ

-

టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న హీరో శర్వానంద్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్రెండ్ అయిన ఈ యంగ్ హీరో..తనకంటూ ఓ పంథా ఏర్పరుచుకుని వైవిధ్యమైన కథలకు వెండితెర మీద రూపమిస్తున్నాడు. అయితే, ఇటీవల కాలంలో శర్వానంద్ నటించిన సినిమాలు కొంచెం సీరియస్ అయిపోయాయి.

‘‘రణరంగం, మహా సముద్రం, శ్రీకారం’’ వంటి చిత్రాల్లో మంచి స్టోరి ఉన్నప్పటికీ పాత్ర పరంగా కొంచెం వెయిట్, సీరియస్ నెస్ బాగా పెరిగిందనే అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫ్యామిటీ ఎంటర్ టైనర్ తో ముందుకొచ్చి సక్సెస్ అందుకున్నాడు శర్వానంద్.

‘‘ఆడవాళ్లు మీకు జోహార్లు’’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు మళ్లీ దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. కాగా, శర్వనాంద్ తనకు సక్సెస్ ఇచ్చిన ఆ బ్యానర్ లో రాబోయే మూవీపైన హోప్స్ పెట్టుకున్నాడట. ఆ బ్యానర్ యూవీ క్రియేషన్స్. కాగా, ఇందులో చిత్రం చేసేందుకు శర్వానంద్ రెడీ అయిపోయారని టాక్. ఈ నేపథ్యంలోనే యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ శర్వానంద్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నట్లు వినికిడి.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ హీరోగా వచ్చిన సినిమాలు ‘‘ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్’’ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ బ్యానర్ లో చేయబోయే సినిమా డెఫినెట్ గా బ్లాక్ బాస్టర్ హ్యాట్రిక్ అవుతుందని శర్వానంద్ భావిస్తున్నారట.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో శ్రీ కార్తిక్ దర్శకత్వంలో ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో నటిస్తున్నాడు. అమ్మ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ చక్కటి పాటను దివంగత సినీ గేయరచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు.

Read more RELATED
Recommended to you

Latest news