పడి పడి లేచె మనసు ఫస్ట్ డే కలక్షన్స్..!

-

శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపుడి డైరక్షన్ లో వచ్చిన సినిమా పడి పడి లేచె మనసు. నిన్న రిలీజైన ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అదరగొట్టిన డైరక్టర్ సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పాడని అంటున్నారు. సూపర్ టాలెంటెడ్ పెయిర్ ఉన్నా సినిమాను హను అంచనాలకు తగినట్టుగా తీయలేకపోయాడని టాక్.

ఇక 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా మొదటిరోజు కేవలం 1.80 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసింది. శర్వానంద్ కెరియర్ లో ఇది సెకండ్ హయ్యెస్ట్ ఫస్ట్ డే కలక్షన్స్ అని తెలుస్తుంది. శర్వానంద్, మారుతి కాంబినేషన్ లో వచ్చిన మహానుభావుడు సినిమా తొలిరోజు 2.60 కోట్లను కలెక్ట్ చేసింది. ఆ సినిమాతో పోల్చుకుంటే ఇంకా 80 లక్షలు వెనుకపడి ఉంది.

ఇక పోటీగా అంతరిక్షంతో పాటుగా కె.జి.ఎఫ్, మారి-2 రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. మరి వీటన్నిటిని దాటి శర్వా బ్రేక్ ఈవెన్ సాధిస్తాడా లేదా అన్నది చూడాలి. అయితే తెలుగు రెండు రాష్ట్రాల్లో మాత్రమే 1.80 కోట్లను వసూళు చేసింది పడి పడి లేచె మనసు ఇంకా ఓవర్సీస్ కలక్షన్స్ రిపోర్ట్ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news