ఈరోజుల్లో క్లీన్ ‘యు’ మూవీ.. శభాష్ శర్వానంద్, హను..!

-

‘యు’ సర్టిఫికెట్ మూవీకి అంత సంబరపడాల్సిన అవసరం ఏముంది.. ఒకప్పుడు పదిలో ఒకటి యు/ఏ, ఏ వచ్చేవి కదా.. మిగతావన్ని ‘యు’ సర్టిఫికెట్ సినిమాలే కదా అని అనుకోవచ్చు. అవును అది నిజమే కాని అది ఒకప్పటి మాట. సినిమాలో లిప్ లాక్ సీన్ లేనిదే కిక్ ఉండదని ఆడియెన్స్ ఫీల్ అయ్యే ఈరోజుల్లో కేవలం ‘యు’ సర్టిఫికెట్ రాబట్టడం చాలా కష్టం. కత్తిగాటు ఉంటేనే యు/ఏ అనే సర్టిఫికెట్ ఇచ్చే సెన్సార్ టీం శర్వానంద్, సాయి పల్లవిల సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చేసింది.

హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను చెరుకూరి ప్రసాద్, చుక్కపల్లి ప్రసాద్ కలిసి నిర్మించారు. లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ ఫుల్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తాడట. సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తుందట. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ తో సర్ ప్రైజ్ ఇచ్చినా యూత్ అలరించే అన్ని అంశాలు ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. మరి ఈ క్లీన్ ఎంటర్టైనర్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుంది అన్నది ఈ శుక్రవారం తెలిసిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news