శంక‌ర్‌-రామ్‌చ‌ర‌ణ్ సినిమాకు హీరోయిన్ ఆమెనే.. ల‌క్ అంటే ఇదే

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో మోస్ట్ వెయిటెడ్ మూవీగా మారింది రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమా. ఈ సినిమా అనుకున్న‌ప్ప‌టి నుంచి అన్నీ అడ్డంకులే వ‌స్తున్నాయి. శంక‌ర్ ఈసినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. అయితే ఆయ‌న ఇండియ‌న్‌-2 సినిమా పూర్తి చేశాకే దీన్ని చేస్తార‌ని తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు ఈ సినిమాకు హీరోయిన్ ఫైన‌ల్ అయింద‌ని తెలుస్తోంది.

 

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాలో ఆలియాభ‌ట్‌ను తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అలాంటి వాటికి చెక్ పెడుతూ కొత్త హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చారు రామ్ చ‌ర‌ణ్‌. ర‌జనీకాంత్ సినిమాతో త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన మాళ‌విక మోహ‌న్ ను తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం.

ఇందుకోసం ఇప్ప‌టికే ఆమెకు క‌థ కూడా చెప్పాడంట శంక‌ర్‌. మాళ‌విక విజ‌య్, లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మాస్ట‌ర్‌లో మెరిసింది. తెలుగులో ఈమెకు ఇదే మొద‌టిసినిమా. రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న ఆమె అయితే బాగుంటుంద‌ని శంక‌ర్ ఓకే చేయించాడంట‌. త్వ‌ర‌లోనే దీనిపై అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్టు తెలుస్తోంది.