పుట్టిన రోజున మహేష్ బాబుకు షాక్…

-

పుట్టిన రోజున మహేష్ బాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు పోలీసులు. అదేంటి అనుకుంటున్నారా ? ఆయనకు జరిమానా విధించేందుకు పోలీసులు రెడీ అయినట్టు సమాచారం అందుతోంది. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. టీఆర్ఎస్ రాజ్యసభ్యులు సంతోష్ బాబు మొదలు పెట్టిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ని దిల్ రాజు మహేష్ కు విసరగా ఆయన స్వీకరించారు. ఈ చాలెంజ్ ను స్వీకరించిన మహేష్ బాబు తన నివాసంలో కొన్ని మొక్కలు నాటడమే కాకుండా, ఈ చాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురు సెలబ్రిటీలని నామినేట్ చేశారు.

ఈ విషయాన్ని మహేష్ బాబు ట్విట్టర్ లో ప్రకటించారు. “నా పుట్టినరోజును ఇంతకంటే బాగా సెలబ్రేట్ చేసుకోలేనేమో! ఈ ఛాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్, తమిళ హీరో విజయ్, శృతి హాసన్ లను నామినేట్ చేస్తున్నాను. ఈ ఛాలెంజ్ కు మద్దతు ఇవ్వాలని మిమ్మల్నిందరినీ కోరుతున్నానని” ఆయన ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ, ఈ వీడియోలో ఆయన మాస్క్ లేకుండా మొక్కలు నాటారు. దీంతో మాస్కులు లేకుండా చెట్టు నాటిన మహేష్ బాబు వెయ్యి రూపాయల జరిమానా విధించేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నట్టు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశంలో మాస్కులు లేకుండా తిరిగి నందుకు ఈ జరిమానా విధిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news