సాధారణంగా వెన్నుపోటు, యూటర్న్ వంటి పదాలకు చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని అంటుంటారు వైకాపా నేతలు! అలాంటి బాబుకే తనదైన యూటర్న్ తో షాక్ ఇచ్చారని అంటున్నారు విశాఖ వాసులు! ఇంతకూ బాబుకే షాకిచ్చిన ఆ బాబు పూర్తి పేరు… బాబు సామాజిక వర్గానికి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు!
అవును… బాబు బొమ్మ అంటే బొమ్మ, బొరుసు అంటే బొరుసు అంటూ బ్లైండ్ గా బాబుకు జై కొట్టే వెలగపూడి తాజాగా బాబుకు షాకిచ్చినంత పనిచేశారు. జగన్ సర్కారు విశాఖను పాలనా రాజధానిగా చేస్తుండడంతో దీనిని వ్యతిరేకించిన వెలగపూడి.. విశాఖ ప్రజలను సైతం కాదని చంద్రబాబు బాటలో నడిచారు. అయితే… ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిననాటినుంచీ పార్టీ కార్యక్రమాలపై యూటర్న్ తీసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు ఇచ్చిన “ఆందోళన” పిలుపుకు ఆయన ఆయన స్పందించలేదు.
దీంతో విశాఖలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలూ బాబు నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లే ఫైనల్ అయ్యింది. కారణం… ఈ సమయంలో బాబు మాట విని “అమరావతి జై.. విశాఖ డౌన్ డౌన్” అంటె… రాజకీయంగా వెలగపూడి బ్రతుకు “డౌన్ డౌన్” అయిపోతుందనే భయం పట్టుకోవడమే! దీంతో ఇక బాబుకు విశాఖ కేంద్రంగా ఉన్న ఆ లాస్ట్ ఆప్షన్ కూడా అయిపోయిందన్నమాట. సరే.. ఏది ఏమైనా… బాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న వెలగపూడి బాబు కూడా ఇలా యూటర్న్ తో షాక్ ఇవ్వడం పార్టీలో హాట్ టాపిక్ అయ్యిందంట!!