మ‌హేశ్ ఫ్యాన్స్‌కు షాక్‌.. స‌ర్కారువారి పాట వ‌చ్చేది అప్పుడే!

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు సినిమా వ‌స్తుందంటేనే ఎన్నో అంచ‌నాలు, ఎన్నోరికార్డులు న‌మోద‌వుతుంటాయి. అలాంటిది ఆయ‌న సినిమా వ‌చ్చి ఏడాది దాటుతున్నా స‌ర్కారువారి పాట సినిమా(Sarkaru Vaari Paata) పై ఎలాంటి అప్డేట్ రాలేదు. అంతే కాదు క‌నీసం ఒక టీజ‌ర్ కూడ రాక‌పోవ‌డంతో ఆయ‌న అభిమానులు తెగ నిరాశ చెందుతున్నారు.

 

ఇక ఇప్పుడు ప‌ర‌శురాం డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న స‌ర్కారువారి పాట పై భారీగానే అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు ఆస‌క్తిని రేపుతున్నాయి. ఈ సినిమా మోస్ట్ వెయిటెడ్ మూవీగా తెర‌కెక్కుతోంది. మ‌హేశ్ బాబు వ‌రుస హిట్ల‌తో జోరుమీద ఉండ‌టం, అలాగే ప‌ర‌శురాం కూడా పెద్ద విజ‌యాల త‌ర్వాత దీన్ని చేస్తున్నాడు.

దీంతో కామ‌న్ గానే ఈ సినిమాపై అంచాన‌లు ఓ రేంజ్‌లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కరోనా కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే. స‌ర్కారు వారి పాట సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ని కూడా పూర్తిగా చేయలేకపోయారు. ప్ర‌స్తుతం దుబాయ్ లో యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. దీని త‌ర్వాత గోవాలో కొన్ని ముఖ్య స‌న్నివేశాల‌ను తీశాక‌, రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు క‌రోనా కార‌ణంగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది. వేసవిలో విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయిన తెలుస్తోంది.