డ్రగ్స్ కేసు: సంజనా ముస్లిం.. షాకింగ్ నిజాలు.

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు ఎన్నెన్నో మలుపులు తిరుగుతుంది. డ్రగ్స్ కేసులో హీరోయిన్ సంజనాని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే విచారణలో ముందుకు వెళ్తున్న కొద్దీ సంజనా గురించి షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. హీరోయిన్ గా అంతగా గుర్తింపు లేని సంజనాకి ఉన్న ఆస్తులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా సంజనా తన మతం మార్చుకున్నట్లు, దానికి ఆధారంగా డాక్యుమెంట్ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంజనా ఇస్లాంలోకి మారినట్టుగా డాక్యుమెంట్ ద్వారా అర్థమవుతుంది. అంతే కాదు ఇస్లాంలోకి మారిన తర్వాత ఆమె పేరు కూడా మారిపోయింది. మహీరా అనే పేరుతో సంజనా ఇస్లాంలోకి మారిందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ డాక్యుమెంట్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితమే మతం మార్చుకున్నప్పటికీ సంజనా ఈ విషయమై ఎక్కడా నోరు విప్పలేదు. రోజు రోజుకీ కొత్త మలుపులు తిరుగుతున్న సంజనా కేసులో మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది.