ఫేస్ బుక్ రూపొందించిన లఘు చిత్రం.. కన్నీళ్లు పెట్టిస్తోందిగా..!

సాధారణంగా సోషల్ మీడియాను ప్రచారం కోసం వినియోగిస్తుంటాం. కానీ ఓ డైరెక్టర్ విభిన్నంగా ఆలోచించారు. కరోనా వల్ల పడిన కష్టాలను ఒక దగ్గర చేరుస్తూ ఓ లఘుచిత్రాన్ని నిర్మించారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో తమను ఆదుకున్న మహిళకు కష్టకాలంలో ఉన్నప్పుడు వారు ఎలా అండగా నిలబడ్డారు.. దృశ్య రూపంలో చక్కగా చిత్రీకరించారు. ఏడున్నర నిమిషాల పాటు సాగే ఈ లఘుచిత్రానికి ‘బదాయిహో’ డైరెక్టర్ అమిత్ శర్మ దర్శక్వతం వహించటం గమనార్హం.

shot film
shot film

కంటతడి పెట్టిస్తోన్న ఈ లఘు చిత్రానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన పూజ.. చిన్న పాల వ్యాపారం చేస్తుండేది. పాలు, పాల ఉత్పత్తులను అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకునేది. అలా సాఫీగా సాగుతున్న వ్యాపారానికి లాక్ డౌన్ అడ్డు తగిలింది. ఒడిదొడుకుల మధ్య ముందుకు సాగుతూ.. ఉండగా పూజకు తన వంతుగా సాయం చేయాలని ఆలోచనలో పడింది. ఉపాధి కోల్పోయిన వారికి తోడ్పాటు అందించాలని.. ఫేసు బుక్ లో ఉద్యోగ పోస్టు పెట్టింది. ఆ పోస్టుకు విపరీతమైన స్పందన వచ్చింది. వారు వీరూ అని తేడా లేకుండా అందరూ దుకాణం వద్ద గుమిగుడారు. కానీ, పూజకు కావాల్సింది.. ఒకరో, ఇద్దరే.

అంతంతమాత్రంగా సాగుతున్న వ్యాపారంలో వీళ్లేందుకని పూజ తమ్ముడు వ్యతిరేకిస్తాడు. అయినా వాళ్లందరికీ ఉద్యోగం ఇచ్చి, పాలకేంద్ర నడిపే మెళకు‌వలు నేర్పింది. వారికి జీతాలు ఇచ్చే స్థోమత లేక తన కారును అమ్మి నెల జీతం ఇచ్చింది. ఇదంత చూస్తున్న తన సోదరుడు వ్యతిరేకాన్ని వ్యక్త పరిచాడు. వాళ్ల వాదన విన్న ఉద్యోగులు పూజకు సాయం చేయాలని ఆమె దయ గుణాన్ని వివరస్తూ ఫేసు బుక్ లో పోస్టు పెట్టారు. తెల్లవారితే దీపావళి… వేకువ జామునే పూజ వచ్చి చూస్తే షాపు రద్దీగా ఉంది. పూజ మొహంలో ఉద్వేకంతో కూడిన ఆనందం… అపరాధ భావంతో తమ్ముడు తల వంచుకున్నాడు. తన ఉత్పత్తులను అందరికీ వివరించి కస్టమర్లను ఆహ్వానించిన తన ఉద్యోగులను చూసి గర్వపడుతుంది. అలా లఘు చిత్రం ముగిసింది.