చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న శ్రియ‌.. ఇలా చూస్తే క‌ష్ట‌మే!

శ్రియ కు తెలుగు ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు ఆమె స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ తో పాటు మ‌తి పోగొట్టే నాజూకు అందాల‌తో కుర్ర‌కారు గుండెల్ని కొల్ల‌గొట్టింది ఈ ముద్దుగుమ్మ‌. వ‌రుస‌గా టాలీవుడ్‌, కోలీవుడ్‌లోని అగ్ర‌హీరోలంద‌రి స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించి త‌న ట్యాలెంట్ నిరూపించుకుంది. అంతేకాదు ఇప్ప‌టికీ త‌న హాట్ అందాల‌తో కుర్ర హీరోయిన్ల‌కు స‌వాల్ విసురుతోంది.

టాలీవుడ్ తెర‌పై శ్రియ అందాలు ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌ట్లేదు. దాదాపు ద‌శాబ్దం పాటు ఆమె తెలుగు సినిమాల‌ను త‌న అంద, చందాల‌తో ఏలిందనే చెప్పాలి. ఒక‌ప్పుడు తెలుగు అగ్ర హీరోలంద‌రికీ ఆమెనే ఆప్ష‌న్ అనేంత‌గా మెస్మ‌రైజ్ చేసింది శ్రియ‌.

ఇక ఇప్ప‌టికీ అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూనే ఉంది. ర‌ష్యాకు చెందిన ప్లేయ‌ర్‌ను పెండ్లి చేసుకుని సెటిల్ అయింది ఈ ముద్దుగుమ్మ‌. అయినా స‌రే సినిమాల‌ను మాత్రం ఆప‌ట్లేదు. ఐట‌మ్ సాంగ్స్ చేస్తూ కుర్ర‌హీరోయిన్ల‌కు సైతం స‌వాల్ విసురుతోంది. ఇక లేటెస్టుగా ఈ భామ త‌న హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం అవ్వి వైర‌ల్‌గా మారుతున్నాయి. వాటిని మీరూ చూసేయండి.