దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.. ఇందులో అజయ్ దేవగణ్ సతీమణి సరోజినీ పాత్రలో హీరోయిన్ శ్రియ నటించారు. తాజాగా ఆమె రాజమౌళి గురించి ఓ విషయాన్ని చెప్పారు. ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాకు మందు దర్శకదిగ్గజం రాజమౌళి ఆరోగ్యసమస్యతో ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని స్టార్ హీరోయిన్ శ్రియ ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కు వెల్లడించింది.
రాజమౌళికి సినిమాలంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చిన శ్రేయ.. “నాకు తెలిసినంత వరకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభానికి ముందు రాజమౌళి గారు ఆస్తమాతో బాధపడ్డారు. అయినా ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఆయన దృష్టి అంతా కథను ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని మీదే ఉంటుంది. సెట్ అంతా దుమ్ము ఉన్నా అలానే వర్క్ చేస్తారు. తెరపై సినిమా అద్భుతంగా ఉండాలని తాపత్రయపడతారు” అంటూ చెప్పింది శ్రియ.
అయితే ఈ సినిమా రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల క్రేజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది.. ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్ల పరంగానే కాదు అవార్డులోనూ రికార్డులు సృష్టిచింది. జాతీయంగా.. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ విజేతగా నిలిచింది. అలాగే శాటర్న్ అవార్డు ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ను వరించింది.