SAINDHAV : వెంకీ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు

-

విక్టరీ వెంకటేష్ రాబోయే తన 75వ సినిమాకు సిద్ధం అయ్యారు. అందుకు చాలా మంది యువ డైరెక్టర్లతో చర్చలు జరిపి చివరికి శైలేష్ కోలనుతో సినిమా చేయబోతున్నారు. ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తీయబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు సైంధవ్‌ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా లో నవాజుద్దీన్ సిద్ధిఖీ అనే
బాలీవుడ్‌ స్టార్‌ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే తెలుగులోకి.. నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. అయితే, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమాలో విలన్‌ గా చేస్తున్నాడా.. లేక.. కీలక రోల్‌ లో కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ.. పేట సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news