సింగర్ మంగ్లీకి సినిమా ఛాన్స్

-

ఫోక్ సాంగ్స్ తో సింగర్ గా తన సత్తా చాటుతున్న సింగర్ మంగ్లీకి లేటెస్ట్ గా ఓ సినిమాలో పాడే అద్భుత అవకాశం వచ్చింది. మైక్ టివి యూట్యూబ్ ఛానెల్ లో ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ పాడుతున్న మంగ్లీ రేలారే రేలారే సాంగ్ తో సూపర్ పాపులర్ అయ్యింది. తెలంగాణా యాసతో ఆమె పాడే పాట అందరిని అలరిస్తుంది. కేవలం యూట్యూబ్ ఛానెల్ లోనే ఇన్నాళ్లు సింగర్ గా ప్రయత్నాలు చేస్తున్న మంగ్లీ ఫైనల్ గా ఓ సినిమాలో పాట పాడే అవకాశం దక్కించుకుంది.

అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో పాట పాడే అవకాశాన్ని అందుకుంది మంగ్లీ. అటు అత్త ఇటు భార్య మధ్య నలిగిపోయే టైం లో వచ్చే ఈ టైటిల్ సాంగ్ ను మంగ్లీ పాడుతున్నట్టు తెలుస్తుంది.

ఇన్నాళ్లు అంతర్జాలానికే అంకితమైన మంగ్లీ ప్రతిభ ఇప్పుడు వెండితెర మీదకు వచ్చింది. ఆమె కెరియర్ కు ఇది ప్రారంభమే కాబట్టి ఆమె పంథాలోనే ఫోక్స్ సాంగ్స్ తో సూపర్ పాపులారిటీ తెచ్చుకోవాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news