మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రాబోతున్న సైరా నరసింహారెడ్డి టీజర్ గురించి అఫిషియల్ న్యూస్ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎనౌన్స్ చేశారు. అనుకున్నట్టుగానే సైరా టీజర్ మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఒకరోజు ముందే ఆగష్టు 21న రిలీజ్ చేయనున్నారు. ఒకరోజు ముందు ముహుర్తం బాగుందనుకుంటా అందుకే చిరు బర్త్ డే ఆగష్టు 22 కాగా.. ముందు రోజే టీజర్ వచ్చేస్తుంది.
సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో వస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా బాహుబలి తర్వాత అంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి.
సినిమాలో అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి వారు నటిస్తున్నారు. నయనతార ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా తమన్నా కూడా సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటుందని తెలుస్తుంది. మరి సైరా టీజర్ తో ఎలాంటి సంచలనాలు మొదలు పెడతాడో చూడాలి.