ఆ డైరెక్ట‌ర్ ఇబ్బంది పెట్టాడంటున్న సింగ‌ర్ సునీత‌.. ఇంత‌కీ ఏం జ‌రిగింది?

సింగ‌ర్ సునీత అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎన‌లేని అభిమానం. తేనె క‌న్నా తీయ‌నైన గొంతులో ఆమె కోట్లాదిమంది ప్రేక్ష‌కుల‌ను త‌న పాట‌లతో క‌ట్టిప‌డేశారు. ఆ గొంతు ఎంతోమంది హీరోయిన్ల‌కు గొంతుగా మారిందంటే.. ఎంత మాధుర్యంగా ఉటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఆమె జీవితంలో కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది.

ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకుంది. అయితే చాలా ఏళ్ల త‌ర్వాత రీసెంట్ గా బిజినెస్ మ్యాన్ రామ్‌ను పెండ్లి చేసుకుంది. పెళ్లి త‌ర్వాత వ‌రుస ట్రిప్ లు వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అయితే త‌న‌ను ఓ డైరెక్ట‌ర్ ఇబ్బంది పెట్టాడంటూ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించి సంచ‌ల‌నం రేపింది.

సోష‌ల్ మీడియా లైవ్ లో ఆమె మాట్లాడుతూ.. తాను ఓ సినిమా కోసం డబ్బింగ్‌ థియేటర్‌లోకి వెళ్లగానే అక్క‌డున్న డైరెక్టర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పింది. హాలో మేడమ్‌.. మీ అభిమానిని అంటూ మెల్ల‌గా మాట‌లు క‌లిపాడ‌ని, ఇక కొంచెం సేప‌య్యాక అరేయ్‌.. కన్నా.. బుజ్జి అంటూ ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేశాడ‌ని చెప్పుకొచ్చింది. ఆ డైరెక్ట‌ర్ ప‌నికి చిర్రెత్తుకొచ్చింద‌ని చెప్పింది. అయితే ఆ త‌ర్వాత ఎప్పుడూ ఆ డైరెక్ట‌ర్ ను క‌ల‌వ‌లేద‌ని, కాక‌పోతే ఇప్ప‌టికీ ఆ విషయం గుర్తొస్తే న‌వ్వొస్తుంద‌ని తెలిపింది.