తప్పొప్పుకొని స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సిరి.. ఏమైందంటే..?

బిగ్ బాస్ ఇంట్లో సిరి , షన్నులు చేసిన రచ్చ చూసి రెండు తెలుగు రాష్ట్రాలు నూరేళ్ల బెట్టాయి. దీంతో ఇద్దరికీ బయట లవర్స్ ఉన్నా కూడా బిగ్బాస్ ఇంట్లో హద్దులు దాటేశారు. షన్నుకోసం దీప్తి, సిరి కోసం శ్రీహాన్ కూడా బయట ఎదురు చూశారు. అయినా కూడా వీరిద్దరూ హగ్గులు, ముద్దులు అంటూ నానారచ్చ చేశారు. సిరి తల్లి అయితే.. షన్నూ కి దూరంగా ఉండు. అన్నలాంటి వాడు అని చెప్పి హింట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ సిరి మాత్రం మారలేదు. బయటకు వచ్చిన తర్వాత సిరీ , షన్నూ లు అంత చనువుగా ఉండడం చేసి తట్టుకోలేకపోయినా దీప్తి సునయన షన్నూ కు బ్రేకప్ చెప్పేసింది. కొన్ని రోజులు సిరి, శ్రీహాన్లు కూడా మాట్లాడుకుంటున్నట్టుగా కనిపించలేదు. చివరికి రవి ఇంట్లో సిరి, శ్రీహాన్ కలిసినట్టుగా ఒక ఫోటో బయటకు వచ్చింది.

మరొకవైపు శ్రీహాన్ ఆరవ సీజన్లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళగా బయటనుంచి సిరి బాగానే సపోర్ట్ చేసింది. శ్రీహాన్ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన సిరి లిప్ లాక్ తో అందరికి షాక్ ఇచ్చి ఒంటిమీద టాటూ కూడా వేయించుకుంది. ప్రస్తుతం వీరి లవ్ స్టోరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా వాలెంటైన్స్ డే స్పెషల్ గా చేస్తున్న స్టార్ మా లవ్ టుడే షోలో సిరి తన తప్పులను ఒప్పుకొని స్టేజ్ పైనే.. ఎవరు కూడా తప్పులను ఒప్పుకోరు.. తెలిసో తెలియకో తప్పులు చేశానని కన్నీరు పెట్టుకుంది. ఆ తర్వాత శ్రీహాన్ రవిలు దగ్గరకు తీసుకొని ఆమెను ఓదార్చారు.

మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో తాను చేసిన తప్పులకు సిరి పశ్చాతాపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక సిరి శ్రీహాన్ల పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.