Sita Ramam: ‘ఓ సీతా’ అంటూ..మృణాళ్ ఠాకూర్ వెంటబడ్డ దుల్కర్ సల్మాన్..చివరకు!

-

మాలీవుడ్ (మలయాళ) యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సీతా రామం’ . టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమాస్ వారు ప్రొడక్షన్ నెం7గా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’’ అనే ట్యాగ్‪లైన్ తో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరి, యుద్ధం నేపథ్యంలో ఈ పిక్చర్ తెరకెక్కుతోంది.

టాలీవుడ్ దిగ్గజ దర్శకులు అశ్వినీదత్, ఆయన కూతురు ప్రియాంక దత్ ఈ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో సుమంత్, రష్మిక మందన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు చక్కటి స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఈ మూవీ అప్ డేట్ కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా మరో అప్ డేట్ ఇచ్చేశారు.

‘‘సీతా రామం’’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఓ సీత హే రామ’‪ని ఈ నెల 9న విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ట్వి్ట్టర్ వేదికగా విడుదల చేశారు. ఈ పిక్చర్ లో హీరోయిన్ బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ నటిస్తోంది. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news