జొమాటో డెలివరీ బాయ్స్ శుభవార్త.. 700 కోట్లు విరాళమిచ్చిన జొమాటో సీఈవో

-

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ దిగ్గజ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఉదారత చాటారు. ఆ సంస్థ డెలివరీ ఏజెంట్ల పిల్లల చదువు కోసం సుమారు రూ.700 కోట్ల (90 మిలియన్‌ డాలర్ల) విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్‌కు ఈ మేరకు ఉద్యోగి స్టాక్ యాజమాన్య ప్రణాళిక(ఈఎస్‌వోపీ)లను కేటాయించారు. అంతర్గత సమాచారం ద్వారా ఈ విషయాన్ని ఉద్యోగులకు తెలిపారు. గత నెలలో సగటు షేర్ ధర ప్రకారం ఈ ఈఎస్‌వోపీల విలువ సుమారు 90 మిలియన్ డాలర్లు (సుమారు రూ.693 కోట్లు) అని అంతర్గత ఉత్తర్వులో ఆయన పేర్కొన్నారు. జొమాటో డెలివరీ భాగస్వాముల పిల్లల విద్య కోసం ఈ నిధులను జొమాటో ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ (జడ్‌ఎఫ్‌ఎఫ్‌) వినియోగిస్తుందని తెలిపారు. కాగా, మహిళా డెలివరీ భాగస్వాములు ఐదేళ్లు, పదేళ్లు సర్వీస్‌లో కొనసాగడం చాలా తక్కువగా ఉంటుందని దీపిందర్ గోయల్ తెలిపారు.

అయితే బాలికల కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపడతామని చెప్పారు. 12వ తరగతి, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అమ్మాయిల కోసం ‘ప్రైజ్ మనీ’ ప్రవేశపెడతామని వెల్లడించారు. అయితే దీని కోసం ఈఎస్‌వోపీ షేర్లన్నింటినీ తక్షణమే లిక్విడేట్ చేయాలనే ఉద్దేశం తనకు లేదని దీపిందర్ గోయల్ స్పష్టం చేశారు. రాబోయే కొన్ని సంవత్సరాలలో ఇదంతా జరుగుతుందన్నారు. తొలి ఏడాది పది శాతం కన్నా తక్కువగా ఈ షేర్లను లిక్విడేట్‌ చేస్తామని చెప్పారు. జొమాటో ఉద్యోగుల నుంచి కూడా తమ ఫౌండేషన్‌ విరాళాలను సేకరిస్తుందని వెల్లడించారు. దీని కోసం జడ్‌ఎఫ్‌ఎఫ్‌లో స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేస్తామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news