చెంపకు చారెడేసి కళ్లు… వెన్నెల వంటి చల్లని చిరునవ్వుతో రామయ్య కోసం హైదరాబాద్ నుంచి కశ్మీర్ వెళ్లిన సీతామహాలక్ష్మి… సగటు ప్రేక్షకుడికి తెగ నచ్చేసింది కదా! రాకుమారిగా దర్బారీ దర్పానికి సిగ్గూ ప్రేమలను కలబోస్తూ ఆ పాత్రలో మృణాల్ ఠాకూర్ జీవించేసింది. ఆత్మహత్య ఆలోచనల్లో కూరుకుపోయిన రోజుల నుంచి ‘సీతారామం’తో విజయాన్ని రుచి చూసే వరకూ… ‘సీత’ పడిన కష్టాలెన్నో! వాటి నుంచి తను నేర్చుకున్న పాఠాలేమిటో… చెబుతోందిలా!
మృణాల్ ఆత్మహత్య చేసుకోవాలని భావించిందంట. టీనేజ్‌లో ఉన్న సమయంలోనే మీడియాలోకి అడుగు పెడదామనుకుంది ఈ భామ. అందుకే పేరెంట్స్‌ను ఒప్పించి మరీ మీడియా కోర్సులో జాయిన్ అయ్యింది. అయితే తన తండ్రి బ్యాంకు ఉద్యోగి కావడంతో.. ట్రాన్సఫర్ అయి ముంబై నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. దాంతో మృణాల్ ఒక్కర్తే ముంబైలో ఉండిపోయింది. ఆ సమయంలో కుటుంబానికి దూరంగా ఉంటున్నాం అనే ఫీలింగ్ తనను ఎంతో బాధ పెట్టిందంట. అదే సమయంలో మీడియా తనకు సెట్ అవ్వదనే భావన వచ్చేసింది. అప్పుడే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది మృణాల్.
ఇక ఆ సమయంలోనే తనకు రకరకాల ఆలోచనలు వచ్చాయంట. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా ఎక్కువగా వచ్చాయి. ఒక రోజు లోకల్ ట్రైన్ నుంచి కిందికి దూకేసి సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించింది” అని చెప్పుకొచ్చింది ఈ సీతారామం బ్యూటీ. సూసైడ్ చేసుకుంటే తన పేరెంట్స్ చాలా తల్లడిల్లుతారని.. భావించి వారిని కష్టపెట్టడం ఇష్టంలేక… ఆత్మహత్య చేసుకోకుండా ఉన్నానని చెప్పింది మృణాల్. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనే కోరిక ఆమెకు పుట్టిందట. అందుకు మోడలింగ్ ప్రారంభించింది. ఆపై సీరియళ్లలో ఆఫర్స్ అందిపుచ్చుకుంది. సీతారామం సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. అయితే సినిమాలో అవకాశాల కోసం ఆమె కూడా అనేక ప్రయత్నాలు చేసింది. సినిమాల్లోకి రాకమందు.. మీడియాలో రాణించాలనుకుంది మృణాల్. అయితే ఆ సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందంట.
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ టాకూర్. ఈ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకుంది. సీతగా నటించి అందరి మన్ననలు అందుకుంది. సీతారామం సక్సెస్‌తో మృణాల్‌కు వరుసగా అవకాశాలు కూడా అందుతున్నాయి.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో అవకాశం వచ్చిందని కానీ అది చేజారిపోయిందని ఈ ముద్దుగుమ్మ వాపోతూ చెప్పుకొచ్చింది. చివరికి ప్రయత్నించగా ‘లవ్ సోనియా’ సినిమాతో తనకు గుర్తింపు వచ్చిందంది. ఆ తర్వాత సినీ అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చాయని ఆమె చెప్పింది.
సీతా రామం సక్సెస్ తర్వాత మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్‌ను డబుల్ చేశారని అయినా కూడా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. ఎన్టీఆర్ 30 టీమ్ మృణాల్ ఠాకూర్‌ను దాదాపుగా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా సీతారామం సినిమాను నిర్మించిన సంస్థ వైజయంతీ మూవీస్ మరోసారి హీరోయిన్‌గా మృణాల్‌కు అవకాశం ఇచ్చిందట. ఈ సినిమాలో ఓ కుర్ర హీరో నటించనున్నాడని అంటున్నారు.