ఉక్రెయిన్ యుద్ధంపై టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పాలంటే ఏం చేయాలో ఎలాన్ మస్క్ తన ట్వీట్ లో పేర్కొన్నారు మస్క్.
రష్యా ఇటీవల నాలుగు ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ వివాదాస్పద ప్రాంతాల్లో యూఎన్ నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించాలని, అక్కడ ప్రజలు ఇచ్చే తీర్పును ఇరు దేశాలు ఆమోదించాలని ఓ ట్వీట్‌లో మస్క్ తెలిపారు. క్రిమియా ప్రాంతాన్ని రష్యా అధికారిక భూ భాగంగా గుర్తించాలని, ఆ ప్రాంతానికి నీట సరఫరాను పునరుద్దరించాలని చెప్పారు.
Russia is doing partial mobilization. They go to full war mobilization if Crimea is at risk. Death on both sides will be devastating.
Russia has >3 times population of Ukraine, so victory for Ukraine is unlikely in total war. If you care about the people of Ukraine, seek peace.
— Elon Musk (@elonmusk) October 3, 2022
మస్క్ ట్వీట్లు చేసిన వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. మీకు ఈ రెండింటిలో దేన్ని ఇష్టపడతారని జెలెన్‌స్కీ ప్రశ్నించారు. మీరు ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తారా అని ఓ ప్రశ్న, రష్యాకు మద్దతు ఇస్తారా అని మరో ప్రశ్న వేశారు.
Let’s try this then: the will of the people who live in the Donbas & Crimea should decide whether they’re part of Russia or Ukraine
— Elon Musk (@elonmusk) October 3, 2022
Which @elonmusk do you like more?
— Володимир Зеленський (@ZelenskyyUa) October 3, 2022