ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..ఇలాంటి పరిస్థితులలో కొందరు ఉద్యోగాలను సక్రమంగా నేరవెరుస్తున్నారు.తీసుకుంటున్న పైసలకు న్యాయం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు..ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విషయానికొస్తే..తుపాను కారణంగా ఫ్లోరిడా వాసుల జీవితం అస్తవ్యస్థంగా మారింది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయి..
వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. లక్షలాది మంది ప్రజలు విద్యుత్, మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారాలన్నీ మూతపడ్డారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఓ జర్నలిస్ట్ మాత్రం కర్తవ్య నిర్వహణలో వెనుకడుగు వేసేదే లేదంటోంది. తుపానులు రానీ, పిడుగులు పడనీ డ్యూటీ ఫస్ట్.. మిగతాది నెక్ట్స్ అంటోంది. ఆ సాహసంతోనే జోరు వాన, భీకర గాలిలోనూ రిపోర్టింగ్ కొనసాగిస్తోంది ఫ్లోరిడాకు చెందిన ఓ రిపోర్టర్. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..
రిపోర్టర్ కైలా గేలర్ తుఫానును కవర్ చేస్తూ ఫీల్డ్ నుంచి రిపోర్టింగ్ ఇస్తోంది. వర్షం నుండి తన మైక్రోఫోన్‌ను రక్షించాలనే ఆలోచనతో ఆమె చేసిన ప్రయత్నం.. ఇప్పుడు వైరల్ అయ్యింది. రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు మైక్రోఫోన్ తడవకుండా ఉండేందుకు ఆ మైక్‌కు కండోమ్ తొడిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… కండోమ్ సెట్ చేయడం వల్ల మైక్రోఫోన్ తడవకుండా ఉంది.’ అని కైలా తెలిపింది. అయితే, ఈ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఇది నెట్టింట వైరల్ అవుతుంది.. కొందరేమో ఈమె ఓవర్ యాక్షన్ కాస్త తగ్గిస్తే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు..
It’s either use a condom with a reservoir tip or have a mic go out. Vet move right here. pic.twitter.com/4GUDmubQGA
— Joe Kinsey (@JoeKinseyexp) September 28, 2022