మహేశ్ బాబుకు ఓ హిట్ మూవీ బాకీ ఉన్నా : ఎస్​జే సూర్య

-

తమిళ నటుడు, దర్శకుడు.. ఎస్​జే సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. ఆయన దర్శకుడిగానే కాదు నటుడిగానూ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు. తాజాగా విశాల్‌తో కలిసి ఆయన నటించిన సినిమా ‘మార్క్‌ ఆంటొని’. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో మహేశ్‌ బాబు గురించి ఆయన ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘‘ఇప్పటి వరకూ దర్శకుడిగా చాలామంది హీరోలకు సూపర్ హిట్‌లు అందించాను. తమిళంలో అజిత్‌, విజయ్‌లతో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు తీశాను. అలాగే తెలుగులోనూ పవన్‌ కల్యాణ్‌తో ‘ఖుషి’ తీసి మంచి విజయాన్ని అందుకున్నాను. కానీ, మహేశ్‌ బాబుకు మాత్రం ‘నాని’తో ఫ్లాప్ సినిమా ఇచ్చాను. అందుకే ఆయనకు బాకీ పడ్డాను. త్వరలోనే మంచి మూవీ తీసి మహేశ్ బాబు బాకీ తీర్చుకుంటాను’’ అని అన్నారు ఎస్​ జే సూర్య. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ చూసి.. ‘ఏ సినిమాకైనా సీక్వెల్‌ తీస్తారా?’ అంటూ మహేశ్‌ అభిమానులు అడుగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news