తన కథను కాపీ కొట్టిన విషయం ముందు తెలిసినప్పుడు? అప్పుడే రచయితల సంఘంలో ఎందుకు పిర్యాదు చేయలేదు అంటూ! పూరి టీమ్ అతన్ని ప్రశ్నిస్తోంది. దానికి అతని దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదుట.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈనెల 18న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజై అయిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై అమాతం అంచనాలు రెట్టింపు అయ్యాయి. పూరి హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయమనే అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది హాలీవుడ్ సినిమా క్రిమినల్ కు కాపీ సినిమాలా ఉందని ఇప్పటికే ఆరోపణలున్నాయి. తెలుగులో కాపీ సినిమాలు అలవాటే కాబట్టి పెద్దగా ఆ ముద్ర పెద్దగా ప్రభావం చూపలేదు. పైగా పూరి మీద ఇప్పటి వరకూ కాపీ రీమార్క్ లు లేనందుకు అతనెందుకు కాపీ కొడతాడని ఓ వర్గం బలంగా భావిస్తోంది.
అయితే తాజాగా ఓ రైటర్ ఇస్మార్ట్ శంకర్ కథ తనదంటూ రచయితల సంఘాన్ని ఆశ్రయించడం అంతటా చర్చకు దారి తీస్తోంది. గతంలో ఇదే కథను సదరు రైటర్ స్రవంతి రవి కిషోర్కు వినిపించాడుట. కానీ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాకపోవడంతో ఆ కథను వదిలేసాడుట. ఇప్పుడదే కథను పూరి తీయడంతో పంచాయతీ సంఘం వరకూ వెల్లిందని అంటున్నారు. అయితే ఇక్కడో డౌట్ అందరికీ కొడుతోంది. సదరు రైటర్ కి తన కథని కాపీ కొట్టాడనడానికి సరైన ఆధారాలు లేవు. పైగా రిలీజ్ కు ముందు పంచాయతీకి రావడంతో అతని ఆరోపణపై అనుమానాలు కలుగుతున్నాయి. పూరి నుంచి డబ్బు వసూలు చేయడం కోసమే ఈ డ్రామాకు తెర తీసాడని కొంత మంది సన్నిహితుల ద్వారా తెలిసింది.
తన కథను కాపీ కొట్టిన విషయం ముందు తెలిసినప్పుడు? అప్పుడే రచయితల సంఘంలో ఎందుకు పిర్యాదు చేయలేదు అంటూ! పూరి టీమ్ అతన్ని ప్రశ్నిస్తోంది. దానికి అతని దగ్గర నుంచి సరైన సమాధా నం రాలేదుట. అయితే సంఘంలో ఫిర్యాదు చేసాడు కాబట్టి అధ్యక్షుడు పూరిని చాంబర్ కు పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కొరటాల శివ కథల విషయంలోనూ ఇలాగే కొంత మంది రచయితలు రిలీజ్ అనంతరం ఆరోపణలు చేసారు. అవన్నీ డబ్బు లు కోసం చేసిన చిల్లర పనులని తర్వాత సంఘం తేల్చింది. క్రియేటివ్ రంగంలో అప్పుడప్పుడు థాట్స్ కోయిన్ సైన్ అవ్వడం జరుగుతుందని సదరు రైటర్ కి చెప్పి పంపిచారు. మరి పూరి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.