బ్లాంక్ చెక్ ఇచ్చినా శోభన్ బాబు చేయలేదా..!

-

పాత తరం హీరోల్లో శోభన్ బాబు క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో అందరికి తెలిసిందే. హీరోగా చేస్తూ హీరోగానే కెరియర్ కు గుడ్ బై చెప్పి క్రేజీ హీరో శోభన్ బాబు. తన అభిమానుల హృదయాల్లో తన అందమైన రూపమే నిలిచి ఉండేలా చేసిన శోభన్ బాబు మహేష్ చేసిన అతడు సినిమా ఛాన్స్ వచ్చినా వద్దని వదిలేశారట. త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అతడు సినిమాలో నాజర్ రోల్ లో శోభన్ బాబుని అనుకున్నారట.

జయభేరి ఆర్ట్స్ లో మురళి మోహన్ అతడు సినిమా నిర్మించారు. అయితే ఈ సినిమాలో నటించాలని శోభన్ బాబుకి బ్లాంక్ చెక్ ఇచ్చాడట మురళి మోహన్ అయినా సరే ఆయన చేయనని చెప్పారట. ఇక బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బ్లాక్ ను తెలుగులో శోభన్ బాబుతో రీమేక్ చేయాలని కూడా అనుకున్నారట. ఆ సినిమా కోసం కోటి ఆఫర్ ను కూడా కాదన్నారట శోభన్ బాబు. హీరోగా చిరస్మరణీయమైన సినిమాలను చేసిన శోభన్ బాబు ఎప్పటికి ఎవర్ గ్రీన్ హీరో అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news