అలా ఉందని శోభిత ధూళిపాలను హేళన చేసేవారా..?

-

ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. ఇక భారీ బడ్జెట్ చిత్రాలలో కూడా అవకాశాలు అందుకుంటూ మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ – 2 తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే “ది నైట్ మేనేజర్ 2” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంకా కోలీవుడ్ లో కూడా కొన్ని కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరియర్ ఆరంభంలో ఎదురైన అవమాన సంఘటనలు తలుచుకొని ఎమోషనల్ అయింది.

శోభిత మాట్లాడుతూ..” ఏ రంగంలోనైనా సరే ప్రారంభం ఒక యుద్ధంలా అనిపిస్తుంది. నేను యాడ్స్ లో నటించేటప్పుడు నల్లగా ఉన్నానని, తెల్లగా లేనని, అందంగా లేనని ఆ యాడ్ కి నువ్వు సరిపోవని ముఖం మీదే చెప్పేవారు. అయినా కూడా నేనెప్పుడూ బాధపడలేదు. నా దృష్టిలో అందం అనేది ఎదుటివారి ఆలోచనలకు సంబంధించిన అంశం.. ఇక నా రూపాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం కూడా నేను మానేశాను.. దానికి బదులుగా క్రియేటివ్ గా ఉండడం కొత్తగా ఉండడం కోసం చాలా గొప్పగా ఆలోచించే దాన్ని చేసే పనిని మరింత శ్రద్ధగా చేయడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు అదే నన్ను పరిశ్రమలో భాగం అయ్యేలా చేసింది. నన్ను ఇంకొకరు గుర్తించేలా చేసింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

మొదటిసారి అనురాగ్ కశ్యప్ తో కలిసి పనిచేసినప్పుడు ఆ సినిమా ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. నటించాలి అన్న తపన ఉన్నప్పుడు ఎటువంటి కష్టమైనా సరే బాధించదు.మొదట కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను.. నా రూపంలో మార్పులు వచ్చి ఉండొచ్చు కానీ నా ప్రవర్తనలో మార్పులు రాలేదు అంటూ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news