బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే కొన్నాళ్ల క్రితం కేన్సర్ ట్రీట్ మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెకు కేన్సర్ అనగానే బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. కేన్సర్ ట్రీట్ మెంట్ కు వెళ్లే ముందు సోనాలి చేసిన ట్వీట్ తన ఫ్యాన్స్ గుండెలు బరువెక్కేలా చేశాయి. తన భర్తకు ఎలాగోలా విషయం చెప్పగలిగినా కొడుక్కి సోనాలి రాసిన లెటర్ కన్నీళ్లు పెట్టించింది.
అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకున్న సోనాలి కేన్సర్ ను జయించింది. మళ్లీ మాములు మనిషిగా మారింది. అయితే తను ట్రీట్ మెంట్ తీసుకుంటున్న టైంలో జీవితంలో చూడాల్సినవన్ని చూశానని అంటుంది సోనాలి బింద్రే. జీవితంలో అద: పాతాళానికి వెళ్లొచ్చినట్టు ఉందని అంటుంది. చావు అంచులదాకా వెళ్లొచ్చిన సోనాలి ఇది తనకు పునర్జన్మ అంటుంది.
నిజంగానే కేన్సర్ ను జయించిన సోనాలి మళ్లీ పుట్టిందని చెప్పుకోవచ్చు. తిరిగి రావడమే కాదు ఓ యాడ్ కోసం రీసెంట్ గా షూటింగ్ లో కూడా పాల్గొంది సోనాలి. కేన్సర్ భారీ నుండి బయటపడిన సోనాలి ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలుస్తుంది. మనకు ఎలాంటి భయకరమైన జబ్బు ఉన్నా మనో స్థైర్యంతో దాన్ని జయించొచ్చని సోనాలి ద్వారా మరోసారి ప్రూవ్ అయ్యింది.