గోల్డెన్ అవర్​లో శ్రీలీల స్టన్నింగ్ ఫొటోషూట్

-

టాలీవుడ్​లో ప్రజెంట్ హాప్పెనింగ్ అండ్​ మోస్ట్ వాంటెడ్​ హీరోయిన్.. శ్రీలీల. ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. దాదాపు డజను సినిమాలు ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఈ బ్యూటీ సినిమాలు వరుసగా రిలీజ్​కు రెడీగా ఉన్నాయి.

పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీలీల.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. ఏకంగా బాలకృష్ణ లాంటి అగ్రతారల సినిమాలో.. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ భామ డ్యాన్స్​ కూడా అద్భుతంగా అదరగొడుతోంది.

ఇక శ్రీలీల సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. ఓవైపు సినిమా షూటింగులు.. మరోవైపు ఈవెంట్లతో బిజీబిజీగా గడుపుతున్నా.. నెట్టింట తన అభిమానులతో టచ్​లో ఉంటుంది ఈ భామ. అప్పుడప్పుడు ఫొటోషూట్లు చేస్తూ అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ గోల్డెన్ అవర్ ఫొటోషూట్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

గోల్డెన్ అవర్​లో వైట్ కలర్ ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో శ్రీలీల ఎంతో అందంగా కనిపిస్తోంది. వైట్ డ్రెస్​లో చందమామలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిండి జాబిలా ఉన్నావ్ శ్రీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ బ్యూటీ అందానికి కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news