బాలకృష్ణ వ్యక్తిత్వంపై శ్రీ లీల వైరల్ కామెంట్స్..!

-

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీ లీల.. తాజాగా ఈ భామ నందమూరి బాలకృష్ణతో ఎన్.బి.కె 108 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.కాగా తాజాగా బాలకృష్ణ వ్యక్తిత్వంపై స్పందించిన శ్రీ లీల వైరల్ కామెంట్స్ చేసింది..

Sreeleela: Mind-blowing beauty.. That's why mind-blank remuneration.. How  much is the film..? | Dhamaka Sreeleela Beats Many Heroines With  Remuneration Telugu Film News

టాలీవుడ్ లో తన యాక్టింగ్, గ్లామర్ తో అభిమానులు ఫిదా చేస్తున్న హీరోయిన్ శ్రీలీల.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఎన్.బి.కె108 సినిమాతో పాటు బాలకృష్ణ గురించి తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

కాగా తను ఎంతో ఆనందంగా ఉంటానని ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా చేస్తానని చెప్పుకొచ్చిన శ్రీ లీల.. ఓ మంచి సినిమా ఉగాది పచ్చడిలా అన్ని రుచుల మిశ్రమంలా అన్ని ఎమోషన్స్ కలిగి ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే తాను అదృష్టం కొలదీ ఈ రంగంలోకి వచ్చానని ఎప్పుడూ జనాల మధ్య ఉండటం తనకు ఇష్టమని అదే తనకి వృత్తిగా మారిందని తెలిపింది.

Sree Leela Biography, Age, Family & Movies - MixIndia

 

అలాగే బాలకృష్ణకు తానెంతో వీరాభిమానినని ఆయనతో కలిసి నటించాక మరింత పెద్ద అభిమానిగా మారిపోయానని చెప్పుకొచ్చింది. బాలకృష్ణ వ్యక్తిత్వం చాలా గొప్పదని అందరితో ఎంతో చక్కగా మాట్లాడతారని.. అంత పెద్ద హీరో అయినప్పటికీ చక్కటి వ్యక్తిత్వాన్ని చూపిస్తారని చెప్పుకొచ్చింది. ఆయనతో సన్నివేశాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నానని డైలాగ్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకుండా అప్రమత్తంగా ఉన్నానని తెలిపింది.

ఎన్.బి.కె 108లో తన రోల్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉందని ఈ సినిమా చూశాక అందరూ తన రాలే చూసి సర్ప్రైస్ అవుతారని తెలిపింది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఒక సినిమాలో నటిస్తున్న శ్రీ లీల.. రామ్ పోతినేని, నవీన్ పోలి శెట్టి, వైష్ణవ తేజ్ లతో కలిసి మరిన్ని సినిమాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news