మా ఆయనతో సమంత కేక్‌ కటింగ్‌.. నేను హర్టయ్యా.. శ్రీరెడ్డి

-

శ్రీ రెడ్డి అభిరామ్‌ ఈ కాంబినేషన్‌లో పేర్లు వినిపిస్తే టక్కున గుర్తొచ్చేది క్యాస్టింగ్‌ కౌచ్‌. అభిరామ్‌ తనను విచ్చల విడిగా వాడేసుకున్నాడంటూ శ్రీ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొత్తానికి ఆ కథ కంచికి చేరిపోయిందనుకోండి అది వేరే విషయం. కానీ శ్రీ రెడ్డి మాత్రం వీలు చిక్కినప్పుడల్లా దగ్గుబాటి వారి ఫ్యామిలీతో ఓ ఆట ఆడుకుంటుంది. అభిరామ్‌‌ను భర్తగా.. సురేష్ బాబుని మామగా.. రానాను బావగా.. చివరికి వెంకటేష్‌ను చిన మామగా వరసలతో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. నిజానికి అభిరామ్‌ పేరుని సురేష్ కన్నా శ్రీ రెడ్డినే ఎక్కువగా ప్రమోట్‌ చేసింది.

అయితే సమంత నటించిన ఓ బేబీ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు చిత్ర యూనిట్‌.. ఈ సినిమాని ప్రొడ్యూస్‌ చేసింది సురేష్‌ బాబు చిన్న కొడుకు అభిరామ్‌.. ఈ ఈవెంట్లో సమంత అభిరామ్‌కు కేక్‌ తినిపించింది.. అభిరామ్‌ అనే పేరు వినిపించగానే శ్రీ రెడ్డి వచ్చేసింది.. సీన్‌లోకి కాదులెండి.. సోషల్‌ మీడియాలోకి.. పాపం శ్రీ రెడ్డి హర్టయ్యిందంటా,,, ఆమెను సమంత పిలవలేదంట..

‘ఓ బేబీ’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్‌కి సమంత మా ఆయన్ని మాత్రమే పిలిచి కేక్‌లు కట్ చేసుకున్నారు. నేను హర్టూ.. మా ఆయన కోతి వేషాలు చూడండహో’ అంటూ శ్రీరెడ్డి పోస్ట్ వదిలింది. ఇప్పుడా పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news