శృతిమించుతున్న శ్రీముఖి.. పిలిచి మరీ ముద్దు పెట్టిందిగా..!

-

ప్రముఖ యాంకర్ గా , నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు యాంకరింగ్ తో మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తూ కేక పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల గ్లామర్ షో తో కూడా పిచ్చెక్కిస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి, రియాల్టీ షోలో కూడా తన సత్తా చాటింది. ఇకపోతే తాజాగా ఈమె మరింతగా శృతిమించుతోంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో ఒక స్టార్ హీరోను పిలిచి మరీ ముద్దు పెట్టడంతో అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడమే కాకుండా శ్రీముఖిపై కూడా కాంట్రవర్సీ మొదలైంది.

ఇదిలా ఉండగా తాజాగా శ్రీముఖి సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి ఆలీతో కలిసి హోస్టుగా చేసింది. ఇక ఈ ఫంక్షన్ కి హిందీ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ హాజరయ్యారు. ఇక రణవీర్ సింగ్ డైయాస్ పై నుంచీ వెళ్ళిపోతుండగా శ్రీముఖి రణవీర్ సింగ్ ను పిలిచి మరీ హగ్గు కావాలని కోరింది . దీంతో ఆయన శ్రీముఖి కి హగ్గుతో పాటు ముద్దు కూడా ఇచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. ఇకపోతే శ్రీముఖిపై కొంతమంది నెట్టుజనులు కూడా ఎందుకు ఇలా శృతిమించుతోంది అంటూ కౌంటర్లు వేస్తున్నారు.. ఇక శ్రీముఖి గురించి, ఆమె అందం గురించి, తన చలాకీ తనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

చిరంజీవిని మొదలుకొని నేటి కొత్తతరం హీరోల వరకు కూడా అందరికీ శ్రీముఖి అంటే ఇష్టమే.. ఇక తన మాటలతోనే ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇటీవల మెయిన్ పాత్రలో క్రేజీ అంకుల్స్ చిత్రంలో కూడా నటించి మెప్పించింది. ఇక తన గ్లామర్ ఫోటో షూట్ తో హాట్ ట్రీట్ ఇచ్చే శ్రీముఖి అంటే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news