ఎస్వీబీసి చైర్మన్ పదవికి పృథ్వీ రాజ్ రాజీనామా చేయడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. ఒక వైసీపీ ఎమ్మెల్యేను వరిస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని తెలిసింది. ఇక ఆ ఆ తర్వాత మొన్న ఒక ప్రముఖ దర్శకుడిని ఆ పదవి వరిస్తుందని, అలాగే నటుడు విజయ్ చందర్ కి జగన్ పదవి ఇస్తారని యేవో వార్తలు ఎక్కువగా వినిపించాయి.
అయితే ఇప్పుడు ఎస్వీబీసీ ఛైర్మన్గా ఈసారి శ్రీనివాస్ రెడ్డిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో జరుగుతున్న వివాదాలపై టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎస్వీబీసీ కొత్త ఛైర్మన్గా ఎస్ శ్రీనివాస్ రెడ్డిని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు సభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకున్నారట.
ఆయన ప్రముఖ దర్శకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో జగన్ ఆ పదవికి శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేసినట్టు సమాచారం. శ్రీనివాస్ రెడ్డి ఢమరుకం, కుబేరులు, టాటా బిర్లా మధ్యలో లైలా, రాగల 24 గంటలు వంటి సినిమాలు తీశారు. త్వరలో ఆయన తీస్తున్న మరో సినిమా ‘భార్యాభర్తల సంఘం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే ఆయన నియామకం కి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.