త‌న గొంతు తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చిందంటున్న శృతిహాస‌న్‌.. ఎందులో తెలుసా!

ల‌క్ అంటే శృతిహాస‌న్ దే అని చెప్పాలి. ఈ భామ టాలీవుడ్ మొద‌ట చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. కానీ ఒకే ఒక్క సినిమా ఈమె ఫేమ్ మార్చేసింది. దీంతో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అదేనండి మ‌న గ‌బ్బ‌ర్ సింగ్‌. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ న‌టించిన ఈ సినిమాతో ఇద్ద‌రూ మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కారు. ఇక అక్క‌డి నుంచి శృతికి వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

సుమారు దశాబ్ద కాలంపాటు టాప్ స్టార్ గా కొనసాగుతోంది ఈ హాట్ బ్యూటీ. అయితే.. ఈ అమ్మడికి ఒక వెలితి ఉంది. అదేదో కాదండీ డబ్బింగ్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ.. అందులోని గొంతు ఆమెది కాదు. తెలుగులో ఇప్పటి వరకూ డబ్బింగ్ చెప్పలేదు ఈ త‌మ‌ళ భామ‌. ఇతరులతోనే చెప్పిస్తోంది. అయితే.. సినిమాను పూర్తిగా ఆస్వాదించాలంటే.. సొంత గొంతు ఉండితీరాల్సిందే అనేది అభిమానుల కోరిక‌.

అయితే.. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన‌ ‘పిట్టకథలు’ సిరీస్ లో మాత్రం సొంతంగా డబ్బింగ్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. ఆమె గొంతుకు ప్రేక్ష‌కులు బాగానే మార్కులు వేశారు. దీంతో.. రాబోయే సినిమాలకు కూడా తానే డబ్బింగ్ చెప్పాలనుకుంటోంది మ‌న హీరోయిన్‌. తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి ఈ శృతికి. త‌న‌ గొంతు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింద‌ని.. భవిష్యత్ లో డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది ఈ పిల్ల‌. కావాలంటే మీరూ చూసి అభిప్రాయం చెప్పండి అంటోంది త‌మిళ కుట్టి.