బ్రేకింగ్ : యశోద ఆసుపత్రికి కేసీఆర్, ఆరు రకాల వైద్య పరీక్షలు

కరోనా బారినపడి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ సోమాజిగూడ లో ఉన్న యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయనకు ప్రస్తుతం ఆరు రకాల పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈనెల 19వ తేదీ కేసీఆర్ కి కరోనా పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచి ఆయన ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌస్ లో ఐసోలేషన్ లో ఉన్నారు.. అయితే ఆయనకు సిటీ స్కాన్ లాంటివి చేయాల్సి ఉండటంతో ఈ రోజు హైదరాబాదులో యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.

ఇక సిటీ స్కాన్ సహా మరో ఐదు పరీక్షలు ఆయనకు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ టెస్టుల రిపోర్టులు కనుక నార్మల్ గా వస్తే ఆయనను మరల ఫాం హౌస్ కు తరలించే అవకాశం ఉంది లేదా హైదరాబాద్ లో ఉన్న క్యాంప్ ఆఫీస్ కు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ  రిపోర్ట్లులో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లు అనిపిస్తే ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే టెస్టులు పూర్తయ్యాక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు వైద్యులు.