‘టైమ్స్ 100 మోస్ట్‌ ఇన్​ఫ్లుయెన్షియల్ పీపుల్‌ ఆఫ్‌ 2023’ జాబితాలో.. ఎస్ఎస్ రాజమౌళి

-

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వరల్డ్ వైడ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా తెలుగు ఇండస్ట్రీకి ఆస్కార్​ను తీసుకువచ్చారు. ఇప్పుడు తాజాగా జక్కన్న మరో అరుదైన ఘనత సాధించారు.

2023కు గానూ ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజీన్‌ రిలీజ్​ చేసిన ‘100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2023’ జాబితాలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వంద మంది వ్యక్తుల జాబితాలో జక్కన్న చోటు దక్కించుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో సీతగా నటించిన ఆలియా భట్‌.. జక్కన్న గురించి టైమ్‌ మ్యాగజీన్‌ ప్రొఫైల్‌ కూడా రాశారు.

ఇక ఈ లిస్ట్​లో రీసెంట్​గా ‘పఠాన్​’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్​ను షేక్​ చేసిన బాలీవుడ్ బాద్​ షా షారుక్‌ ఖాన్​ కూడా స్థానం​ సంపాదించుకున్నారు. ఈ 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుర జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌, హాలీవుడ్‌ తార ఏంజెలా బాసెట్‌, ప్రఖ్యాత రచయిత సల్మాన్‌ రష్దీ, న్యాయనిర్ణేత పద్మలక్ష్మి, బుల్లితెర ప్రయోక్త తదితరులకు చోటు దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news