SSMB28 Title: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 28 వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసినిక్ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా టైటిల్ ఏంటి..? అంటూ అటు ఘట్టమనేని అభిమానులు, ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులలో ఎక్కువగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి అమరావతి అటు ఇటు, గుంటూరు కారం, ఊరికి మొనగాడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు శుభవార్తని అందించింది మూవీ యూనిట్.
ఈ మూవీకి ( ) అనే టైటిల్ ని ఖరారు చేసింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేసింది. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.