‘స్త్రీ2’ కలెక్షన్ల జోరు.. 6వ రోజు పూర్తయ్యేసరికి రూ.250కోట్లు

-

బాలీవుడ్లో శ్రద్ధా కపూర్, రాజ్కుమార్ రావు నటించిన ‘స్త్రీ 2’ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి కలెక్షన్లలో దూసుకెళ్తోంది. మొదటి రోజు నుంచే హిట్ టాక్ అందుకుని బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ‘స్త్రీ 2’ విడుదలైన(ఆగస్టు 15) రోజునే ‘ఖేల్‌ ఖేల్‌ మే’, ‘వేదా’ చిత్రాలు కూడా రిలీజ్ అయినా వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. ఆ రెండు పెద్ద సినిమాలను శ్రద్ధా కపూర్ మూవీ బీట్ చేస్తోంది. కానీ ఆ రెండు చిత్రాల కలెక్షన్లను స్త్రీ 2 బీట్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్‌ అవుతోంది.

ఈ చిత్రం ఆరవ రోజు పూర్తయ్యేసరికి రూ.250కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా తొలి రోజు 51.8 కోట్లు, రెండో రోజు రూ. 31.4 కోట్లు, మూడో రోజు రూ. 43.85 కోట్లు, నాలుగో రోజు రూ.55.9 కోట్లు, ఐదో రోజు రూ. 38.1 కోట్లు, ఆరో రోజు రూ. 25 కోట్లు మొత్తంగా ఇండియాలో రూ.254.55 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news