శ‌ర్వానంద్ వ‌ర్సెస్ సుధీర్‌వ‌ర్మ ర‌ణ ‘ రంగం ‘

శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైన‌ర్ ర‌ణ‌రంగం. డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లేతో తెర‌కెక్కిన ఈ సినిమాలో శ‌ర్వా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని హీరోయిన్లుగా న‌టించారు. గ‌త గురువారం అడవి శేష్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఎవ‌రు సినిమాకు పోటీగా వ‌చ్చిన ర‌ణ‌రంగం మిక్స్ డ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి డిజాస్ట‌ర్ దిశ‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌న్ అవుతోంది.

శర్వానంద్, దర్శకుడు హను రాఘవాపుడితో పడి పడి లేచే మనసు సినిమాతో పాటే మొదలుపెట్టినా సుధీర్ వర్మ రణరంగాన్ని.. చాలా స్లోగా షూటింగ్ చేస్తూ వచ్చాడు. మొదట్లో ఈ సినిమాపై పెద్ద‌గా హైప్ లేదు. ఆ త‌ర్వాత శ‌ర్వా లుక్స్‌, టీజ‌ర్లు, ట్రైల‌ర్ల త‌ర్వాత క్రేజ్ వ‌చ్చింది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణరంగం మొదటి షోకే యావరేజ్ అనిపించుకున్నా తొలి రోజు మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి.

అక్క‌డ నుంచి బాగా డ్రాప్ అయిపోతున్నాయి. ఆదివారం వచ్చేసరికి మరీ దారుణంగా పడిపోయాయి. సినిమా మ‌రీ ఇంత డ‌ల్ అయిపోవ‌డానికి కేవ‌లం శ‌ర్వానందే కార‌ణ‌మ‌ని డైరెక్ట‌ర్ సుధీర్‌వ‌ర్మ‌, నిర్మాత‌లు గుర్రుగా ఉన్నార‌ట‌. సినిమా రిలీజ్‌కు ముందు ప్ర‌మోష‌న్ల విష‌యంలో ఏ మాత్రం ప‌ట్టించుకోని శ‌ర్వా రిలీజ్ అయ్యాక రెండో రోజే షాకింగ్ కామెంట్స్ చేయ‌డం దెబ్బ ప‌డిన‌ట్ల‌య్యింది.

గురువారం సినిమా రిలీజ్ అయితే రెండో రోజే శర్వానంద్ సినిమాలో కథ లేదు.. కేవలం స్క్రీన్ ప్లే నచ్చి సినిమా చేసానని ప్రతిసారి చెప్పడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్ష‌కులు ఎక్కువుగా ఆస‌క్తి చూప‌లేద‌ని తెలుస్తోంది. ఎంత నిజాలు ఒప్పుకున్నా సినిమా థియేట‌ర్ల‌లో ఉండగా.. అది కూడా రెండో రోజే ఇలా మాట్లాడ‌డంతో సినిమా పూర్తిగా డ‌ల్ అయ్యింది.