ఓటీటీలో సుఖేశ్ చంద్ర విత్ జాక్వెలిన్ ల‌వ్ స్టోరీ

బాలీవుడ్ ను న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుఖేశ్ చంద్ర శేఖ‌ర్ మ‌నీ లాండ‌రింగ్ కేసు షేక్ చేస్తుంది. ఈ మ‌నీ లాండ‌రింగ్ కేసు లో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు సంబంధం లేకున్నా.. సుఖేశ్ చంద్ర శేఖ‌ర్ తో ఉన్న సంబంధం కార‌ణం గా ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు సుఖేశ్ చంద్ర శేఖ‌ర్ రూ. 10 కోట్ల విలువైన బ‌హుమ‌తులు ఇచ్చాడ‌ని అలాగే మ‌రి కొన్ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదీల ఉండ‌గా వీరి మ‌ధ్య చాలా రోజుల నుంచి ల‌వ్ స్టోరీ కూడా న‌డుస్తుంది. అయితే ప‌రిణామాన్ని కొంత మంది నిర్మాతలు క్యాష్ చేసుకోవ‌డానికి సిద్ధ ప‌డుతున్నారు.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుఖేశ్ చంద్ర శేఖ‌ర్ ల మ‌ధ్య ఉన్న ల‌వ్ స్టోరీని వెబ్ సిరీస్ గా తీయాల‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం. అయితే ఇటీవ‌ల ఓటీటీ లలో ఇలాంటే కాంట్ర‌వ‌ర్సీ క‌థలే హిట్ కొడుతున్నాయి. దీంతో ఈ స్టోరీని వెబ్ సిరీస్ గానీ సినిమా గా గానీ తీయాల‌ని ప‌లువురు నిర్మాతలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే క‌థ ను కూడా సిద్ధం చేశార‌ని స‌మాచారం. లీడ్ రోల్స్ అయిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుఖేశ్ చంద్ర శేఖ‌ర్ పాత్ర‌ల‌లో ఎవ‌రిని తీసుకోవాల‌నే అంశం పై చ‌ర్చిస్తున్నార‌ని తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల్లో నే దీని పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.