పుష్ప కోసం సుకుమార్ మాస్ట‌ర్ ప్లాన్‌.. అదిరిపోయే ట్రీట్‌!

-

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌కు సౌత్ ఇండ‌స్ట్రీలో ఉన్న మార్కెట్ అంద‌రికీ తెలిసిందే. తెలుగు అగ్ర‌హీరోగా కొన‌సాగుతున్నాడు. ఇక ఈ స్టైలిష్ హీరోకి, లెక్క‌ల మాస్టర్ సుకుమార్ కాంబోకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్ప‌టికే వీరిద్ద‌రూ క‌లిసి ఆర్య సినిమాతో ఇండ‌స్ట్రీకి ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు వారిద్ద‌రూ క‌లిసి మ‌ళ్లీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

పుష్ప సినిమాతో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారారు. ఎర్ర‌చంద‌నం దొంగ‌గా బ‌న్నీ ఇందులో క‌నిపిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్ అంచ‌నాలు పెంచేసింది.

ఇక ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను రెండు పార్టులుగా తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. అయితే ఇప్పుడు క‌రోనా కార‌ణంగా సినిమా ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి సినిమాపై అంచ‌నాలు త‌గ్గ‌కుండా ఉండేందుకెఉ ఈ సినిమాలోని ఐట‌మ్ సాంగ్‌ను రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులేస్తోంద‌ని తెలుస్తోంది. మ‌రి దీనిపై ఎలాంటి మెసేజ్ ఉంటుందో చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news