సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్

-

యువ హీరోల్లో సందీప్ కిషన్ వరుస సినిమాలైతే చేస్తున్నాడు కాని అందుకు తగినట్టుగా ఫలితాలను మాత్రం అందుకోవడం లేదు. లేటెస్ట్ గా నెక్స్ట్ ఏంటి అంటూ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందీప్ కిషన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను షురూ చేశాడు. కామెడీ డైరక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి డైరక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ సినిమా వస్తుందట. తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను అందించడంలో సక్సెస్ అవుతున్న నాగేశ్వర్ రెడ్డి ఈడోరకం ఆడోరకం తర్వాత హిట్టు కొట్టలేదు.

దర్శకుడు, హీరో ఇద్దరు హిట్ కోసం తపిస్తున్న ఈ టైంలో తెనాలి రామకృష్ణ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని అంటున్నారు. సినిమాలో హీరోయిన్ గా హాన్సికను సెలెక్ట్ చేయడం విశేషం. సందీప్ కిషన్ తో తొలిసారిగా హాన్సిక జోడీ కడుతుంది. అమ్మడు కూడా తెలుగు, తమిళ భాషల్లో కొన్నాళ్లు వరుస సినిమాలు చేయగా ఇప్పుడు అక్కడ ఇక్కడ పెద్దగా ఆఫర్లు దక్కించుకోవడం లేదు. మరి ఈ సినిమాతో హాన్సిక మరోసారి తన సత్తా చాటుతుందేమో చూడాలి. ఎంటర్టైనర్ ప్రధానంగా సాగే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news