సన్నీ వచ్చేసింది.. అభిమానులు ఫుల్ ఖుష్..!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సన్నీలియోన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు శృంగార తారగా ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన సన్నీలియోన్ ఆ తర్వాత ఆ వృత్తికి స్వస్తి పలికి నటిగా మారిన విషయం తెలిసిందే. బాలీవుడ్లోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది సన్నీలియన్. అయితే ఇటీవలే సన్నీలియోన్ కరోనా వైరస్ నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళింది.

ఇక ఇటీవలే మళ్లీ ముంబై తిరిగి వచ్చింది సన్నీలియన్. అయితే ముంబైలో ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితులు సద్దుమనుగక పోయినప్పటికీ ఇంత తొందరగా సన్నీ ఎందుకు తిరిగి వచ్చింది అని కొంతమంది భావిస్తే .. సన్నీ తిరిగి వచ్చినందుకు అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక పలు షూటింగ్ లు ప్రారంభమైన నేపథ్యంలో సన్నీ లియోన్ ముంబై వచ్చినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించి తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది సన్నీ లియోన్.