16 ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వల్ వస్తుంది..!

-

కోలీవుడ్ లో సీక్వల్ సినిమాలపై ఇంకా ఇంట్రెస్ట్ తగ్గలేదు. పందెం కోడి, సామి స్క్వేర్ ఇలా సీక్వల్ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా మరో సూపర్ హిట్ సినిమా సీక్వల్ ప్లానింగ్ తో అందరికి సర్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏ సినిమాకు సీక్వల్ వస్తుంది అంటే సూర్య, గౌతం మీనన్ కాంబినేషన్ లో వచ్చిన కాక్కా కాక్కా సినిమాకు సీక్వల్ రాబోతుందట.

గౌతం మీనన్ ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథ సిద్ధం చేశాడట. సూర్య కూడా ప్రస్తుతం సెల్వ రాఘవన్ డైరక్షన్ లో ఎన్.జి.కే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత గౌతం మీనన్ సినిమానే చేస్తాడని అంటున్నారు. అయితే విశాల్ తో గౌతం మీనన్ సినిమా కమిట్ అవగా అది అయ్యేదాకా మాత్రం సూర్య వెయిట్ చేయాల్సిందే. కాక్కా కాక్కా సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ ఘర్షణ గా రీమేక్ చేశారు. మరి ఈ సీక్వల్ పై వెంకీ కన్ను పడుతుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news