ఎన్.టి.ఆర్ ను చూసినట్టే ఉంది.. బయోపిక్ పై కృష్ణ స్పందన..!

-

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా తీశారు. బయోపిక్ మొదటి పార్ట్ గా ఎన్.టి.ఆర్ కథానాయకుడు బుధవారం రిలీజయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. నందమూరి అభిమానులకు, టిడిపి కార్యకర్తలకు ఈ సినిమా బాగా నచ్చింది. సగటు సిని ప్రేక్షకుడు కూడా ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ గారిలా బాలయ్య నటన చూసి మెచ్చుకుంటున్నారు.

ఇక ఈ సినిమాను చూసిన చాలామంది సెలబ్రిటీస్ తమ స్పందన తెలియచేశారు. ఇప్పుడు వారి లిస్ట్ లో సూపర్ స్టార్ కృష్ణ కూడా చేరారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని.. ఎన్.టి.ఆర్ జీవితాన్ని చాలా చక్కగా చూపించారని అన్నారు కృష్ణ. తెర మీద ఎన్.టి.ఆర్ నే చేస్తున్నట్టుగా ఉందని బాలకృష్ణ అంత గొప్పగా చేశారని అన్నారు. ఎన్.టి.ఆర్ అన్ని గెటప్పులు వేసిన బాలకృష్ణ వందశాతం ఆయనలా అనిపించారని ప్రశంసించారు. ఇంతకుముందే సూపర్ స్టార్ మహేష్ కూడా సినిమా ఎన్.టి.ఆర్ కు గొప్ప నివాళి అంటూ ట్వీట్ చేశారు. సినిమాలో నరేష్ వైబి సుబ్బరావు పాత్రలో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version