స్టార్ వారసుడు అనగానే అతనికి హీరో ఛాన్సులు వచ్చేస్తాయి. తండ్రి రిఫరెన్స్.. ఆయన చేతిలో ఉన్న దర్శక నిర్మాతలు స్టార్ తనయుడిగా అవకాశాలు ఇచ్చేస్తారు. మొదటి రెండు అవకాశాలు అలా వచ్చినా ఆ తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. మనోడిలో టాలెంట్ ఉందా లేదా అన్నది కనిపెట్టేసిన దర్శక నిర్మాతలు చేతులెత్తేస్తారు. అవకాశం వచ్చినప్పుడే ప్రూవ్ చేసుకుంటేనే స్టార్ కొడుకైనా నిలబడేది.
తండ్రికి తగ్గ తనయుడు అని చాలా తక్కువ సందర్భాల్లో అంటాం.. అయితే ఇప్పటి స్టార్స్ లో ఆ మాట మాత్రం వాడే ఒకే ఒక్క హీరో సూపర్ స్టార్ మహేష్. కృష్ణ గారి వారసుడిగా ఆ రాజసం కొనసాగిస్తున్నాడు మహేష్. కృష్ణ ఎలాగైతే ప్రయోగాలు చేస్తూ వచ్చారో మహేష్ కూడా తన 19 సంవత్సరాల కెరియర్ లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చాడు.
తనకున్న ఇమేజ్ కు మాస్ కథలు చేస్తే ఎప్పుడో టాలీవుడ్ నెంబర్ 1 చెయిర్ సొంతం చేసుకునే వాడు. కాని సినిమా వసూళ్లు.. హిట్లు లెక్క కాదు అభిమానులకు మంచి సినిమా అందించే ఆలోచనే తనదని రకరకాల సినిమాలు చేస్తూ వచ్చాడు. తెలుగు హీరోనే అయినా హాలీవుడ్ హీరో కటౌట్ ఉన్న మహేష్ తన ప్రతి సినిమాకు చాలా కొత్త ప్రయత్నాలు చేస్తాడు.
వీటిలో ఫలితాలు కొన్ని నిరాశ పరచినా మరికొన్ని మాత్రం సతృప్తి పరిచాయి. సినిమా పోయినా అది తన వల్లే అని ఒప్పుకునే వినమ్రత కలిగిన వాడు మహేష్. ఇక ఓడటం గెలవడం అలవాటుగా మారిన మహేష్.. ఓడి గెలిచిన వాడు కాబట్టి సినిమా పోయినా భయపడే ఆలోచన మానుకున్నాడు.
తన అభిమానులు ఎప్పుడు తల ఎత్తుకుని.. మా హీరో సినిమా అని చెప్పుకునేలా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు.. ఉన్నాడు మహేష్. ఫలితాలతో సంబంధం లేదు కాబట్టే ఆయనకు ఈ అభిమాన గళం అండగా నిలబడింది. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన నవ యువ నట శేఖర సూపర్ స్టార్ మహేష్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతుంది మనలోకం.కామ్.