F3లో పవన్ కల్యాణ్..సర్‌ప్రైజ్ రివీల్ చేసిన దిల్ రాజు

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన F3 ఫిల్మ్ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ సభ్యులు ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చిత్రానికి సంబంధించిన ఓ బిగ సర్ ప్రైజ్ రివీల్ చేశారు.

పిక్చర్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉన్నారని చెప్పారు. దాంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్-వెంకటేశ్ కలిసి ‘గోపాల గోపాల’ సినిమా చేశారని గుర్తు చేసుకుంటున్నారు. జనసేనాని ‘అజ్ఞాతవాసి’ ఫిల్మ్ లో విక్టరీ వెంకటేశ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే దిల్ రాజు ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ F3 సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రమే కాదు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ ఉంటారని, అందుకు అనుగుణంగా అనిల్ రావిపూడి చక్కటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు. దాంతో ఈ చిత్రంపైన అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

ఎఫ్ 2 ని మించిన వినోదాన్ని F3 డెఫినెట్ గా అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలు కాగా, హీరోయిన్స్ గా తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా కౌర్ నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news