నిన్నటికి నిన్న ఘట్టమనేని మంజుల మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యులు ఎక్కువగా ఫిట్నెస్ పై ఫోకస్ పెడతారు అంటూ తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే అందుకు తగ్గట్టుగానే ఈరోజు నమ్రతాకు సంబంధించి.. జిమ్ లోని వర్కౌట్స్ వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకెళితే సాధారణంగా ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ ని బట్టి డిఫరెంట్గా కనిపించినా సరే ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఎప్పుడూ వారు ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. హీరోలు, హీరోయిన్లు అయితే జిమ్ వర్కౌట్ చేయడం తప్పనిసరి.. అయితే స్టార్ హీరోల భార్యలకు.. పిల్లలు, ఇళ్లు అంటూ బోలెడన్ని పనులతో జిమ్ చేసే అంత సమయం కూడా దొరకదు. అందుకే పెళ్లి తర్వాత గుర్తుపట్ట లేకుండా మారిపోయిన హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు.
అయితే నమ్రతా కూడా ఒకవైపు పిల్లలు.. మరొకవైపు భర్త బిజినెస్ లు అంటూనే ఇంకొక వైపు తన కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తున్న ఈమె అంత బిజీ షెడ్యూల్ లో కూడా తనకంటూ సమయం కుదుర్చుకొని మరీ ఫిట్నెస్ ఫ్రీ కె అంటూ కష్టపడి వర్క్ అవుట్ చేస్తోంది. ప్రస్తుతం ట్రైనర్ సహాయంతో కఠినమైన కసరత్తులు చేస్తూ చెమటోడుస్తున్నారు నమ్రత. మహేష్ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలన్నీ చూస్తూ ఉండే ఈమె ఇప్పుడు ఏ ఎం బి సినిమాస్, ఇటీవల స్టార్ట్ చేసిన హోటల్ బిజినెస్ ఇతర ఫ్యామిలీ వ్యవహారాలతో కూడా బిజీగా ఉంటుంది.
మరొకవైపు తన ఆరోగ్యం పై దృష్టి సారించాలి అని ఫిట్నెస్ కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అంటూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో బాగా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా మూడు మిలియన్ల మంది ఈమెను ఇన్స్టాల్ లో ఫాలో అవుతున్నారు. మొత్తానికి అయితే జిమ్ లో వర్క్ ఔట్స్ తో కసరత్తులు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది నమ్రత.