భారీ ధరకు అమ్ముడుపోయిన సూర్య” కంగువ” ఓటీటీ రైట్స్..!

-

తమిళ్ హీరోగా సూర్య గుర్తింపు తెచ్చుకున్నా సరే తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరో అని చెప్పాలి. తెలుగులో కూడా ఈయన తన సినిమాలను విడుదల చేస్తూ ఇక్కడ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడు అయ్యాడు. అంతేకాదు సూర్య నటించే చిత్రాలు ఇక్కడ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతూ భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం శివ దర్శకత్వంలో హై బడ్జెట్ చిత్రంగా సూర్య నటిస్తున్న చిత్రం కంగువ. ఇటీవలే రిలీజ్ అయిన గ్లింప్స్ తో సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది.

జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే బాహుబలిని మించే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని ఆయన పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ చిత్ర నిర్మాణం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అలాగే తాజాగా సూర్య గెటప్ కూడా ఆసక్తిని రేపుతోందని చెప్పాలి. ఇక వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా అప్పుడే వరుస బిజినెస్ లలో రికార్డులు మొదలు పెట్టేసింది ఈ సినిమా.. తాజాగా ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు అఫీషియల్ గా చిత్ర బృందం ప్రకటించింది.

తాజాగా ఈ సినిమా సౌత్ ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ రికార్డు ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ్, మలయాళం , కన్నడ భాషల్లో ఓటీటీ రైట్స్ కి గాను అమెజాన్ సంస్థ నిర్మాతకి రూ.80 కోట్ల మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ డీల్ ని ఫిక్స్ చేశారని.. మొత్తం పది భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా ప్లాన్స్ జరుగుతున్నట్లు సమాచారం. మరొకవైపు నార్త్ ఓటిటి బిజినెస్ డీల్ ఇంకా పూర్తి కాలేదు. ఇక ఈ సినిమాలో దిశాపటాని సూర్య సరసన హీరోయిన్గా నటిస్తోంది . సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news